హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌కు ప్రజలే పిండం పెడతారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘అష్టకష్టాలుపడి తెలంగాణ సాధించుకొచ్చి సుస్థిర ఆర్థిక ప్రగతితో తలసరి ఆదాయం, విద్యుత్తు సౌకర్యం పెంచి, ప్రతి ఇంటికి శుద్ధమైన నల్లా నీళ్లు ఇచ్చి, ఒక యజ్ఞంగా ఇవన్నీ చేసుకుం టూ పోతుంటే కేసీఆర్‌కు పిండం పెడతామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేసినందుకా నాకు పిండం పెటేది? ఈ తిప్పల పడ్డందుకా పిండం పెట్టేది? మీ వల్ల కాని పని, మీ నాయకులు వెన్నుచూపి పారిపోయిన తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజాన వేసుకొని, అనేక కష్టాలుపడి, దీక్షలు చేసి చివరికి నా చావుమీదకు తెచ్చుకొని తె లంగాణ తెచ్చిపెడితే నీకు పిండం పెడతం అంటే ఎవరు హర్షిస్తరు? ఇదేనా సంస్కా రం? ఇది పద్ధతా, ఇది పార్టీయా? నోరుందికదా అని విచ్ఛలవిడిగా మాట్లాడితే, మీ పార్టీ లో నియంత్రణ లేకపోవచ్చు కానీ సమాజం చూస్తది.. ఊరుకోదు. ఆర్థిక నేరస్తులందరికీ మోదీ పేరే ఉన్నదని మొన్న రాహుల్‌గాంధీ ఏదో ఒక మాట అంటే రెండు సంవత్సరాల జైలుశిక్ష విధించారు.
పార్లమెంటు సభ్యత్వం కూడా తీసేసిండ్రు. మేము ఆ చర్యలు తీసుకోలేమా? మేము స్వేచ్ఛ ఇచ్చాం. ప్రజాస్వామ్యయుతంగా ఉంటున్నాం. లేకపోతే మీరు అట్ల మాట్లాడినదానికి మీ తాటతీయడం పెద్ద ఇష్యూ కాదుకదా? మీరు అడ్డగోలుగా మా ట్లాడుతున్నా మీ మీదకు పోలీసులను ఉసిగొల్పలేదు. సంయమనం పాటిస్తున్నం. ప్రజలే తీర్పు చెప్తారని మేము ముందుకు పోతావు న్నం. తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్నరు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలనో ప్రజలే నిర్ణయించాలి. ధరణి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దీస్ ఈజ్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ డెమోక్రసీ. ఎంపవర్మెంట్ ఆఫ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణ. నీ సొంత బొటన వేలితో మారే అవకాశాన్నిచ్చింది. రైతు బొటనవేలు లేకుండా ఏ ఒక్క వ్యక్తి మార్చలేడు. ఆ అధికారం ఈ రో జు రైతు చేతిలో ఉన్నది. తెలంగాణ రైతన్నా! నీ చేతిలో ఉంచుకుంటవా? దుర్మార్గపు కాం గ్రెస్ ప్రచారానికి బలైతవా? నిర్ణయం తీసు కో. ఇంత కష్టపడి, ఇంత మంచి సిస్టం తెచ్చిన మాకు పిండం పెడతమని మాట్లాడుతరు. ఎ వరికి పిండం పెట్టాల్నో ఈ ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తరు. మంచి చెడును ప్రజలే తేల్చుకోవాలే’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.