Delhi court | ఢిల్లీలోని సాకేత్ కోర్టు (Delhi court) వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కోర్టులో పనిచేస్తున్న ఓ వికలాంగ క్లర్క్ భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య (Clerk commits suicide) చేసుకున్నాడు. పని ఒత్తిడి (work pressure) కారణంగానే బలవన్మరణానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్లో రాశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
హరీష్ సింగ్ మహర్ అనే వ్యక్తి సాకేత్ కోర్టులో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. అయితే, అతను ఓ వికలాంగుడు. శుక్రవారం ఉదయం ఉన్నట్టుండి కోర్టు పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను 60 శాతం వికలాంగుడిని. ఈ ఉద్యోగం నాకు చాలా కఠినమైనది. ఒత్తిడి తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అంటూ హరీష్ సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సాకేత్ పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
Road Accident: రోడ్డు ప్రమాదంలో మాజీ హోంశాఖ మంత్రి కుమార్తె మృతి
TCS | ఆఫీస్‌కు రాకపోతే హైక్స్, ప్రమోషన్స్ ఉండవు.. ఉద్యోగులకు టీసీఎస్ హెచ్చరికలు
S Jaishankar | యూఎస్‌లో 670 కిలోమీటర్లు రోడ్డుమార్గంలోనే ప్రయాణించిన జైశంకర్