S Jaishankar | ప్రభుత్వ షట్‌డౌన్ (US government shutdown) కారణంగా గతేడాది నవంబర్‌లో అమెరికా వ్యాప్తంగా విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. వేలాది విమానాలు రద్దు, ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, విదేశాంగ మంత్రి జైశంకర్ (S Jaishankar) కూడా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లు తెలిసింది.
గతేడాది జైశంకర్ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం న్యూయార్క్ వెళ్లారు. ఆ సమయంలో ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో జై శంకర్ రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. దాదాపు 670 కి.మీలు రోడ్డు మార్గం (670 kilometers by road)లోనే ప్రయాణించినట్లు విదేశాంగ శాఖ నివేదిక వెల్లడించింది. ప్రతికూల పరిస్థితుల్లో ఏడు గంటల పాటు కారులో ప్రయాణించి మాన్‌హట్టన్ వెళ్లినట్లు పేర్కొంది.
Also Read..
Nitin Gadkari | రోడ్డు ప్రమాదాల నివారణకు వీ2వీ సాంకేతిక పరిజ్ఞానం : నితిన్ గడ్కరీ
Shashi Tharoor | నేను నెహ్రూని ఆరాధిస్తా.. కానీ ఆయన విధానాలను సమర్థించను : శశి థరూర్
Cook Arrested: చపాతీలపై ఉమ్మిన వీడియో వైరల్.. కుక్‌ను అరెస్టు చేసిన పోలీసులు