Nitin Gadkari | దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను (road accidents) అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) గురువారం కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వెహికిల్ టు వెహికల్ (వీ2వీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని (V2V communication technology) తప్పనిసరి చేయనున్నట్టు తెలిపారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కార్లలో ఉచిత స్పెక్ట్రమ్‌ను ఉపయోగించి వెహికల్ టు వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. దీని ద్వారా వాహనాలు ఒకదానికొకటి వైర్‌లెస్‌గా సమాచారం పంపుకుంటూ డ్రైవర్లను అప్రమత్తం చేస్తాయని ఆయన తెలిపారు. డ్రైవర్‌కు రియల్‌టైంలో సమీపంలోని ఇతర వాహనాలు, స్పీడు, ప్రమాదకర ప్రాంతాలు తదితర వివరాలు పంపించి, తగిన హెచ్చరికలు చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని చెప్పారు. దీనివల్ల ప్రమాదాలు తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఈ పరిజ్ఞానం ద్వారా రోడ్డుపై ఏదైనా వాహనం ఆగి ఉన్నప్పుడు, ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేసినప్పుడు సమీపంలోని వాహనాలకు హెచ్చరికలు వెళతాయని ఉదహరించారు. ఈ ఏడాది చివరికి ఈ వైర్లెస్ టెక్నాలజీని అన్ని వాహనాల్లో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు గడ్కరీ వెల్లడించారు.
Also Read..
Shashi Tharoor | నేను నెహ్రూని ఆరాధిస్తా.. కానీ ఆయన విధానాలను సమర్థించను : శశి థరూర్
Cook Arrested: చపాతీలపై ఉమ్మిన వీడియో వైరల్.. కుక్‌ను అరెస్టు చేసిన పోలీసులు
ఈడీని ఇష్టారీతిన వాడుతున్న కేంద్రం.. బెంగాల్లో విపక్షాల స్ట్రాటజీలు కొట్టేసేందుకు దాడులు