చిట్యాల: సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నేరేడ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు దుబ్బాక వెంకట్‌రెడ్డి కిడ్నీ వ్యాధితో దవాఖానలో చిక్సిత పొందుతున్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.10లక్షల చెక్కును గురువారం బాధితుడికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మెరుగైన వైద్యం కోసం సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం సహాయనిధి అందజేయడం జరుగుతుందని తెలిపారు.
రామన్నపేట: పేదల కష్టల్లో కేసీఆర్ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని బోగారం గ్రామానికి చెందిన చల్లమల్ల జగన్నాధం ఆనారోగ్యంతో నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్నా డు. కుటుంబ సభ్యుల ఆర్ధిక స్థితిగతులను తెల్సుకొని వారికి వైద్యఖర్చుల నిమిత్తం రెండు లక్షల యాభైవేల రూపాయల ఎల్వోసీ చెక్కును గురువారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మెన్ నంద్యాల భిక్షంరెడ్డి, అంతటి రమేశ్, బొక్క మాధవరెడ్డి ఉన్నారు.