Sumit Nagal : భారత నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు సుమిత్ నగాల్ (Sumit Nagal)కు భారీ ఊరట లభించింది. ఆస్ట్రేలియా ఓపెన్ (Australia Open) ప్లే ఆఫ్స్‌కు సిద్ధమైన అతడకి వీసా క ష్టాలు తొలగిపోయాయి. తనకు వీసా మంజూరు చేయాలని నగాల్ పెట్టిన ఎక్స్ పోస్ట్‌కు గురువారం చైనా విదేశాంగ శాఖ స్పందించింది. మళ్లీ దరఖాస్తు చేసుకోండి వీసా ఇచ్చేస్తాం అని చెప్పింది. దాంతో.. ఆస్ట్రేలియా ఓపెన్ ప్లే ఆఫ్స్‌లో నగాల్ ఆడడానికి మార్గం సుగమమైంది.
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ జరుగనుంది. ఈ టోర్నీ సన్నద్ధతలో ఉన్న సుమిత్ నగాల్ వీసా అభ్యర్దనపై చైనా విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందించింది. ‘నిబంధనలకు లోబడే అన్ని దేశాల అథ్లెట్లతో పాటు భారత అథ్లెట్లకు కూడా చైనా వీసాలు మంజూరు చేస్తుంది. నగాల్ మరోసారి అన్ని పత్రాలతో వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. ఆటగాళ్లు వ్యక్తిగత వీసా కోసం నిర్ణీత సమయంలోపు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నగాల్ విషయంలోనూ అంతే. అప్పుడు అతడికి వీసా ఇవ్వడం గురించి ఆలోచిస్తాం’ అని ఆ దేశ విదేశాంగ శాఖ మీడియా ప్రతినిధి లిన్ జియాన్ తెలిపారు.
In response to a question from a foreign journalist that Indian tennis player Sumit Nagal claims that he was denied a visa by China, Chinese Foreign Ministry spokesperson Lin Jian said on Thursday that China issues visas for athletes from all countries, including India, in… pic.twitter.com/4ywAdW6gnX
— Global Times (@globaltimesnews) November 13, 2025
”గౌరవనీయులైన చైనా అంబాసిడర్.. నా పేరు సుమిత్ నగాల్. భారత నంబర్ 1 టెన్నిస్ ఆటగాడిని. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్లే ఆఫ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేను త్వరలోనే చైనాకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఏ కారణం లేకుండానే నా వీసాను నిరాకరించారు. మీరు త్వరగా స్పందించి సాయం చేస్తే నాకు ఎంతో మేలు చేసినవారవుతారు’ అని మంగళవారం ఎక్స్ వేదికగా నగాల్ దౌత్యాధికారులను అభ్యర్థించాడు.
[URGENT]
Respected @China_Amb_India and @ChinaSpox_India
I am Sumit Nagal, India’s No.1 Tennis player
I am supposed to fly to China soon to represent India at the Australian Open Playoff. But my visa was rejected without reason
Your urgent help would be much appreciated 🙏🏽
— Sumit Nagal (@nagalsumit) November 11, 2025
ఆస్ట్రేలియా ఓపెన్ ఆసియా ఫసిఫిక్ వైల్డ్ కార్డ్ ప్లే ఆఫ్స్ నవంబర్ 24 నుంచి నవంబర్ 29 వరకూ చైనాలోని ఛెంగ్డూలో ఈ టోర్నీ జరుగనుంది. ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపిస్తే వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నగాల్ అర్హత సాధించే అవకాశముంది. అందుకే అతడు ఈటోర్నీకి పక్కాగా సిద్దమయ్యాడు. చైనా విదేశాంగ రిప్లైతో అతడికి టోర్నీలో అడేందుకు అవకాశం లభించనుంది. హర్యానాలోని ఝజ్జర్‌కు చెందిన నగాల్ ప్రస్తుతం మెరుగైన ర్యాంక్ కలిగిన భారతీయుడు. అతడు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 275వ స్థానంలో ఉన్నాడు.