రఘునాథపాలెం, ఏప్రిల్ 13 : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధర సోమవారం క్వింటా రూ.21 వేలు పలికింది. కొనుగోళ్లు మొదలైన జనవరి 1 నుంచి ఖమ్మం మార్కెట్కు 13లక్షల మిర్చి బస్తాలను రైతులు విక్రయించేందుకు తీసుకొచ్చారు.
ఈ సీజన్ పూర్తయ్యే నాటికి మరో 3లక్షల బస్తాల వరకు రావొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 34లక్షలకు పైగా మిర్చి బస్తాలు మార్కెట్కు తరలివచ్చాయి. గతేడాది మిర్చి ధర రూ.12,500 నుంచి 14వేల వరకు మాత్రమే పలికింది.