ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటిలో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు.. తదితర అంశాల కలబోతగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నాగబంధం’. విరాట్‌కర్ణ కథానాయకుడిగా అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. నభా నటేష్, ఐశ్వర్యమేనన్ కథానాయికలు. జులై 3న సినిమా విడుదల కానున్నది.
ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను ఈ నెల 19న విడుదల చేయనున్నారు. ‘సుర సుర’ అంటూ సాగే ఈ పాటను.. సంపద్రాయ పెళ్లి సంబరాల ఆనందోత్సాహాలను ప్రతిబింబించేలా భారీ సెట్స్, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందించారు. జునైద్ కుమార్ అభే సంగీతం, గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్స్‌గా నిలువనున్నాయి. అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్గొండ గద్దర్ ఈ పాటను ఆలపించగా, కాసర్ల శ్యామ్ రాశారు. ఈ సినిమాకే ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.