జనగామ రూరల్, ఏప్రిల్13 : ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో నిరుద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా పెంబర్తిలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం పెంబర్తికి చెందిన తంగళ్లపల్లి వీరబ్రహ్మచారి కుమారుడు సాయికిరణ్ (23) ఏడాది క్రితం బీటెక్ పూర్తి చేశాడు.
కొంతకాలంగా ఉద్యోగంకోసం ప్రయత్నిస్తున్నా ఎక్కడా దొరుకలేదు. దీంతో మనస్తాపానికి గురైన సాయికిరణ్ సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృ తుడి తండ్రి వీరబ్రహ్మచారి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.