Huzurabad | గెల్లు శ్రీను గెలుపుతో హుజూరాబాద్‌లో మార్పు : కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్

హుజూరాబాద్ టౌన్ : పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ కు పేదల బాధలు తెలుసు కనుక గెల్లు శ్రీనివాస్ గెలుపుతో హుజూరాబాద్‌లో పేదల కష్టాలు తీరుతాయని అందుకోసం గెల్లు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్ పిలుపునిచ్చారు.
సోమవారం పట్టణంలోని 27వ వార్డు మారుతినగర్, ఇందిరనగర్‌లో ఆయన డోర్ టు డోర్ తిరిగి గెల్లు శ్రీనివాస్ తరపున కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రజల దశాబ్దాల కల నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ రాష్ర్టంలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు మండలాలు ఏర్పాటు చేయడమే కాక ప్రజలకు అన్ని రకాల పాలనా పరమైన అంశాలు అందుబాటులోకి తీసుకురావడంలో సీఎం విశేషంగా కృషి చేశారన్నారు. రాష్ర్టంలో అర్హులందరికీ ప్రభుత్వ ప్రయో జనాలు అందేలా కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. గతంలో పెన్షన్లు, రాయితీలు ప్రభుత్వ పథకాలు అందరికీ అందేవికాదని, ఇప్పుడు అందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయన్నారు.
ఏడేండ్లు మంత్రిగా ఉండి ఈటల చేయని అభివృద్ధిని టీఆర్ఎస్ పార్టీ మూడు నెలల్లో చేసిందని, హుజూరాబాద్‌లో జరుగు తున్న అభివృద్ధి పనులతో రూపురేఖలే మారిపోయాయి అని వివేకానంద తెలిపారు. అభివృద్ధిని కోరుకునే ప్రజలు సంక్షే మాన్ని కోరుకునే ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు శ్రీనివాస్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. మరింత అభివృద్ధి సంక్షేమ ఫలాలను పొందాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేటర్ భూమాగౌడ్, గౌడ సంఘ నాయకుడు శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చొల్లేటి శ్యామ్, తాళ్లపల్లి శ్రీకాంత్, తాళ్లపెళ్లి అరుణ్గౌడ్, మూల వెంకటరమణగౌడ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

