గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన సమయాల్లో మార్పు : టీటీడీ
గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శన వేళల్లో మార్పు : టీటీడీ | తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో మే ఒకటో తేదీ నుంచి భక్తులకు దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు.

తిరుమల : తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో మే ఒకటో తేదీ నుంచి భక్తులకు దర్శన సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు ఆలయ స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ స్వామి వారి దర్శన సమయాల్లో మార్పులు చేస్తూ.. ఉప ఆలయాల్లో దర్శనాలు రద్దు చేసింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలుపుతారు. అనంతరం 6.30 గంటలకు స్వామి వారికి తోమాల సేవ, సహస్రనామార్చన సేవలు నిర్వహించనున్నారు. ఈ సేవల కాలంలో భక్తులకు లఘు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు, 9.30 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనానికి అనుమతించరు. రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. అలాగే గోవింద రాజస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాల్లో భక్తులకు దర్శనాలను రద్దు చేశారు. భక్తులు విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.
ఇవి కూడా చదవండి..
ప్రధాని అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
రాష్ట్రంలో వింత వాతావరణం..
బెంగాల్.. సస్పెన్స్ థ్రిల్లర్!
18+కు టీకాలెలా?
మ్‌డెసివిర్ ప్లీజ్!
‘స్పుత్నిక్ వీ’లో వైరస్
ముంబైలో మూడు రోజులు వ్యాక్సినేషన్ బంద్
ఇజ్రాయిల్ మౌంట్ మెరెన్లో తొక్కిసలాట.. 44 మంది మృతి
తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

