ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీజీ సీపీజీఈటీ – 2025 సూపర్ న్యూమరరీ సీట్లకు సర్టిఫెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను విడుదల చేసినట్లు సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. క్యాప్, ఎన్సీసీ, పీహెచ్ కేటగిరీల అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మ్యానువల్‌గా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఓయూలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి ఇది జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు రెండో దశ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు క్రమం తప్పకుండా తమ వెబ్సైట్లో చూడాలని సూచించారు.