UPS | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) అమలును మోదీ సర్కారు ప్రకటించింది. పదవీ విరమణ పొందినవారికి పింఛన్ హామీ, ఆర్థిక భద్రతలే లక్ష్యంగా పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్), జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) రెండింటి ప్రయోజనాలను కలగలిపి ఈ యూపీఎస్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నది. అయితే అర్హులైనవారికి ఈ యూపీఎస్ ఎలాంటి పరిస్థితుల్లో వర్తిస్తుందో కూడా ఇందులో పేర్కొన్నారు.
కనీసం పదేండ్లు ఎంపిక చేసిన సేవలు అందించి, ఆ తర్వాత రిటైరైన ఉద్యోగులకు యూపీఎస్ వర్తిస్తుంది.
పెనాల్టీ ప్రొవిజన్స్ కింద కాకుండా రిటైరైన ప్రభుత్వ ఉద్యోగులే అర్హులు.
కనీసం 25 ఏండ్లు పనిచేసి, ఆ తర్వాత స్వచ్చంధ పదవీ విరమణ తీసుకున్నవారికి రిటైర్మెంట్ వయసు వచ్చాకే పింఛన్.
డిస్మిస్, ఉద్యోగం నుంచి తొలగించినవారు, రాజీనామా చేసినవారికి యూపీఎస్‌ను ఎంచుకొనే అవకాశం ఉండదు.