Warangal | వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని (MGM Hospital) పైకప్పు పెచ్చులు ఊడివరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో మరోసారి పెచ్చులు ఊడిపడటం కలకలం రేపింది. తాజాగా ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను పెను ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ఎంజీఎం దవాఖానకు మీడియా రాకుండా ఆంక్షలు విధించారు. హాస్పిటల్ గేటు ముందు పోలీసులను భారీగా మోహరించారు.
కాగా, దవాఖాన స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ముగ్గురు రోగులు సహా 8 మందికి గాయాలైన ఘటన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో ఆదివారం జరిగింది. ఉదయం 9 గంటల సమయంలో ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడి సీలింగ్ పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కింద కూలిపోయింది. ఈ ప్రాంతంలో పక్షవాతంతో చికిత్స పొందుతున్న మస్తాన్, సారయ్య, ఆయాసంతో చికిత్స పొందుతున్న స్వప్నకు తీవ్ర గాయాలయ్యాయి. అటెండెంట్లు ఓంకార్, ఎల్లమ్మ, భిక్షపతి, వార్డును శుభ్రం చేస్తున్న శానిటేషన్ ఉద్యోగులు పుష్ప, సౌందర్య స్వల్పగాయాలతో బయటపడ్డారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి ఊడిపడిన పెచ్చులు
ఆసుపత్రిలోని ఆర్ఐసీయూ, ఫిజియోథెరపీ విభాగంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులు
ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
ఎంజీఎం ఆసుపత్రిలోకి మీడియా రాకుండా ఆంక్షలు
ఆసుపత్రి గేటు ముందు భారీగా మోహరించిన పోలీసులు https://t.co/iQ1QZqpd7O pic.twitter.com/yGUACi1XdF
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2026