ఢిల్లీ ,జూన్ 22: యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) నుంచి అదనపు ఈక్విటీ వాటాలు కొనుగోలు చేయడానికి హైనెకెన్ ఇంటర్నేషనల్ బి.వి. (హెచ్ఐబీవీ) సంస్థకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. కాంపిటీటివ్ యాక్ట్-2002లోని 31(1) సెక్షన్ ప్రకారం ఆమోదం తెలిపింది.
ఈ లావాదేవీ ద్వారా యూబీఎల్లో హెచ్ఐబీవీ గరిష్టంగా 16.40 శాతం వాటాను పొందడానికి వీలుకలుగుతుంది. హెచ్ఐబీవీ అనేది ఓ పెట్టుబడుల సంస్థ. బీర్, ఆల్కహాల్ లేని బీర్, పండ్లరసాలు, పండ్లరసాల ఆధారిత పానీయాలు, ఇతర పానీయాల ఉత్పత్తి, ప్యాకింగ్, పంపిణీ, మార్కెటింగ్, అమ్మకాలు చేస్తున్న అంతర్జాతీయ సంస్థల సముదాయమే హైనెకెన్ గ్రూప్. కంపెనీల చట్టం-1956 కింద ఏర్పాటైన పబ్లిక్ లిమిటెడ్ సంస్థ యూబీఎల్. ఈ సంస్థ వాటాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో నమోదయ్యాయి.