అల్కరాజ్ రీఎంట్రీ అదుర్స్.. యూఎస్ ఓపెన్‌లో శుభారంభం
గాయం నుంచి కోలుకొని నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ కోర్టులోకి దిగిన స్పానిష్ సంచలనం, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ తన రీఎంట్రీ మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు.
న్యూయార్క్: గాయం నుంచి కోలుకొని నాలుగు నెలల విరామం తర్వాత మళ్లీ కోర్టులోకి దిగిన స్పానిష్ సంచలనం, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ తన రీఎంట్రీ మ్యాచ్‌లో అదిరిపోయే ప్రదర్శనతో విజయాన్ని అందుకున్నాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ అల్కరాజ్ 6-4, 6-4, 6-4తో రష్యా ప్లేయర్ రోమన్ సెఫియుల్లిన్పై వరుస సెట్లలో అలవోక విజయం సాధించి రెండో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఏప్రిల్ నుంచి మణికట్టు గాయంతో ఆటకు దూరమైన 23 ఏండ్ల అల్కరాజ్ ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. 139 రోజుల తర్వాత తిరిగి పోటీలోకి వచ్చిన అతను ఎక్కడా అలసట, శారీరక సమస్యలు లేకుండా తనదైన శైలిలో పవర్ఫుల్ షాట్లతో ఆకట్టుకున్నాడు. 2 గంటల 21 నిమిషాల ఈ పోరులో మొదట కాస్త జాగ్రత్తగా ఆడిన కార్లోస్ తర్వాత రిథమ్‌లోకి వచ్చాడు.
తొలి సెట్ ఏడో గేమ్‌లో సెఫియుల్లీన్ సర్వీస్ బ్రేక్ చేసి ముందంజ వేశాడు. రష్యాకు చెందిన 99వ ర్యాంకర్ సెఫియుల్లీన్ ఓసారి అల్కరాజ్ సర్వీస్ బ్రేక్ చేసినా.. ప్రత్యర్థి బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లను తట్టుకోలేక ఇబ్బంది పడ్డాడు. కార్లోస్ 20 ప్లస్ ఫోర్ హ్యాండ్ విన్నర్లతో సత్తా చాటాడు. 2 ఏస్‌లు మాత్రమే కొట్టినా.. 4 బ్రేక్ పాయింట్లు, 19 నెట్ పాయింట్లతో మెప్పించాడు. రెండో రౌండ్లో అతను పోర్చుగల్ ప్లేయర్ జేమీ ఫరియాతో తలపడనున్నాడు. నొవాక్ జొకోవిచ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించడం, గాయం కారణంగా వరల్డ్ నంబర్ వన్ సినర్ టోర్నీకి దూరం అవ్వడంతో అల్కరాస్ టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. మరోవైపు 10వ సీడ్ ఆర్థర్ ఫిల్స్‌కు అన్‌సీడెడ్ ప్లేయర్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్) షాక్ ఇచ్చాడు.
మొదటి సెట్ కోల్పోయినప్పటికీ పుంజుకున్న సిట్సిపాస్ 4-6, 7-6(7/3), 6-1, 6-4 తేడాతో ఫిల్స్‌ను ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్, ఫెలిక్స్ అలియాసిమే (కెనడా) 7-5, 4-6, 6-3, 7-5 తో ఆస్ట్రేలియా ప్లేయర్ హిజికాటాను ఓడించగా.. 8వ సీడ్ లోకల్ ప్లేయర్ షెల్టన్ 1-6, 6-1, 7-6(7/3), 6-2తో డచ్ ఆటగాడు గ్రీక్స్పూర్పై విజయం సాధించాడు. 11వ సీడ్ తియఫో (అమెరికా) ఐదు సెట్ల హోరాహోరీ పోరులో 1-2తో వెనుకంజ వేసినా పుంజుకొని 6-4, 4-6, 3-6, 6-3, 6-4తో మార్టిన్ డామ్‌ను ఓడించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు పోపిరిన్ 3-6, 6-3, 6-2, 6-4తో దిమిత్రోవ్‌కు షాకివ్వగా..14వ సీడ్ టియెన్ 6-4, 6-1, 6-2తో నూనో బోర్జెస్‌ను ఓడించాడు.

స్వియాటెక్, ఒసాకా ముందుకు
మహిళల విభాగంలో సీడెడ్ ప్లేయర్లు ముందంజ వేశారు. ఆరో సీడ్ లిండా నొస్కోవా, ఎనిమిదో సీడ్ ఇగా స్వియాటెక్‌తో పాటు జపాన్ స్టార్ నవోవి ఒసాకా శుభారంభం చేసింది. నొస్కోవా (చెక్) 7-5, 6-1తో వొలీనెట్స్ (అమెరికా)పై నెగ్గగా, పోలాండ్ స్టార్ స్వియాటెక్ 6-2, 6-3తో వాంగ్ జియు (చైనా)ను చిత్తు చేసింది. స్టయిలిష్ ఔట్ఫిట్తో స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన 13వ సీడ్ ఒసాకా 7-6 (8/6), 7-6 (7/3)తో రష్యన్ జఖరోవాపై రెండు సెట్లలో టై బ్రేక్స్‌లో పోరాడి విజయం సాధించింది. పదో సీడ్ అనిసిమోవా 6-1, 6-3తో అమెరికాకే చెందిన క్రెయెగర్ను ఓడించింది. 22వ సీడ్ మాడిసన్ కీస్, సినియకోవా, స్లోన్ స్టీఫెన్స్ కూడా శుభారంభం చేయగా, 28వ సీడ్ బెజెలెక్ తొలి రౌండ్లోనే ఓటమి పాలైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

