హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ జూబ్లీహిల్స్ అపోలో దవాఖాన నుంచి ఆదివారం డిశ్చార్జి అయ్యారు. శనివారం స్వల్ప అస్వస్థతకు గురైన ఆయనను అపోలో దవాఖానలో జాయిన్ చేసి, మెరుగైన చికిత్స అందించారు. తీవ్రమైన అలసట కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో కార్డియాటిక్, శ్వాసకోశ సంబంధ పరీక్షలు నిర్వహించి.. మెడిసిన్స్ అందించారు.
శనివారమే ఆయన ఆరోగ్యం మెరుగవగా.. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి.. ఆదివారం డిశ్చార్జి చేయడంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. దీంతో తెలంగాణలో పాల్గొనాల్సిన కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.