హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మేడ్చల్ డిపోకు చెందిన మహిళా కండక్టర్ మానవత్వాన్ని చాటారు. ఆదివారం సికింద్రాబాద్ స్టేషన్లో 229 బస్సు పాయింట్ వద్ద ఓ ప్రయాణికుడు ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అకడ ఎంతోమంది ఉన్నా కానీ ఒకరూ ముందుకు వచ్చి సాయం చేయలేదు.
అయితే, ఆ సమయంలో విధుల్లో ఉన్న మేడ్చల్ డిపో కండక్టర్ మహిళా కండక్టర్ బస్సులో నుంచి తాళంచెవి తీసుకొచ్చి అతడి చేతిలో పెట్టి సాయం చేశారు. సకాలంలో స్పందించడంతో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆమె చూపిన మానవత్వాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కొనియాడారు. ఆర్టీసీ సిబ్బంది నిబద్ధతకు మహిళా కండక్టర్ స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు.