కాలిఫోర్నియా: వైఫై సిగ్నల్స్‌తో గుండె వేగాన్ని కచ్చితంగా లెక్కగట్టే సరికొత్త టెక్నాలజీని అమెరికాలోని కాలిఫోర్నియా వర్సిటీ ఇంజనీర్లు తయారుచేశారు. వీరు అభివృద్ధి చేసిన ‘పల్స్-ఫై’అనే పరికరం.. 10అడుగుల దూరంలో ఉన్న వ్యక్తి గుండె వేగాన్ని అత్యంత కచ్చితంగా కొలుస్తున్నట్టు ప్రయోగాల్లో తేలింది.
సాధారణవైఫై ట్రాన్స్మిటర్, రిసీవర్లను మెడికల్ సాధనాలుగా మలుచుకొని ‘పల్స్-ఫై’ అనే వ్యవస్థను ఇంజనీర్లు రూపొందించారు. దీంట్లో స్మార్ట్‌వాచ్, ఛాతికి అతికించే పట్టీలు, దవాఖాన మానిటర్లతో అవసరం లేదు. ఇండ్లు, పని ప్రదేశాల్లో ప్రస్తుతం మనం వాడుతున్న వైఫై హార్డ్‌వేర్, ఇతర పరికరాలతోనే ‘పల్స్-ఫై’ని తయారుచేసుకోవచ్చు.