హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఐదేండ్ల పైబడి సర్వీసున్న ఇన్ సర్వీస్ టీచర్లందరూ రెండేండ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలని, లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. సర్వీసులో ఉన్న సీనియర్ టీచర్ల ప్రయోజనాల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి వెంకట్ కోరారు.
విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ 2010లో ఎన్సీటీఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పదోన్నతి పొందాలంటే టెట్ అవసరమా? లేదా అనే వివాదంపై వివిధ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని తెలిపారు.