Marco Movie Censor Board | మార్కో (Marco) సినిమాను బ్యాన్ చేయాలంటూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కేంద్రానికి లేఖ రాసినట్లు తెలుస్తుంది. మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మార్కో (Marco). హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. యాక్షన్ జానర్లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. సినిమాలో మితిమీరిన వయోలెన్స్ ఉన్న కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రం. అయితే ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ సెన్సార్ బోర్డు కేంద్రానికి లేఖ రాసింది.
ఈ సినిమా ఓటీటీలో సోనీ లివ్(Sony LIV)తో పాటు అమెజాన్ ప్రైమ్(Prime Video), ఆహా(Aha)లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమాను ఓటీటీ (Marco OTT Ban)లో నుంచి బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కోరింది. ఈ చిత్రాన్ని మరి దారుణంగా తెరకెక్కించడంతో పాటు చిన్న పిల్లలను క్రూరంగా చంపడం, గర్భిణి యువతిని.. కళ్లు లేని యువకుడిని చంపే సన్నివేశాలు దారుణంగా ఉన్నయంటూ సెన్సార్ బోర్డ్ తెలిపింది. అందుకే ఈ సినిమాను ఓటీటీలో నుంచి తొలగించాలని కోరుతూ లేఖ రాసినట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాను టీవీలో ప్రసారం చేయకుండా బ్యాన్ విధించినట్లు తెలుస్తుంది.
Also Read..