చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) భారీ కాన్వాయ్, భద్రత మధ్య ఆ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌కు చేరుకున్నారు. అయితే మెడిటేషన్ కోసం భారీ హంగామాతో ఆయన వచ్చిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. హోషియార్‌పూర్‌లోని విపాసన కేంద్రంలో బుధవారం నుంచి పది రోజులు కొనసాగే మెడిటేషన్ కోర్సులో భార్యతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కేజ్రీవాల్ ఇలా భారీ కాన్వాయ్‌లో పంజాబ్‌కు వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్ భద్రతను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భద్రతతో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పోల్చారు. ‘వీఐపీ సంస్కృతి కోసం ప్రపంచం మొత్తాన్ని విమర్శించే కేజ్రీవాల్, నేడు డోనాల్డ్ ట్రంప్ కంటే పెద్ద భద్రత మధ్య తిరుగుతున్నారు’ అని ఎక్స్ పోస్ట్‌లో ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను షేర్ చేశారు.
కాగా, ఢిల్లీకి చెందిన బీజేపీ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా కూడా కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. మహారాజు మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘ఒకప్పుడు వ్యాగన్ఆర్లో సామాన్యుడిగా నటించిన అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడు బుల్లెట్‌ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్లు, వంద మందికి పైగా పంజాబ్ పోలీస్ కమాండోలు, జామర్లు, అంబులెన్స్‌లతో కూడిన విలాసవంతమైన మహారాజా కాన్వాయ్‌లో విపాసన ధ్యానం కోసం వెళ్లారు. అధికారం ఆయన పరీక్ష అయితే ఘోరంగా విఫలమయ్యారు. ఆప్ నిజం బయటపడింది. మోసం, కపటత్వం, వీఐపీ అహంకారానికి ఇది పరాకాష్ట’ అని ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు.
जिस पंजाब की जनता ने इतना प्यार दिया उससे इतना डर लगता है केजरीवाल जी को? सारी दुनिया को VIP कल्चर पर टोकने वाले केजरीवाल जी आज ख़ुद Donald Trump से बड़ा सुरक्षा घेरा लेकर घूम रहे हैं।
ग़ज़ब ही है… कैसे पंजाब जैसे महान सूबे को सबने अपने ऐश आराम के साधन निकालने का ज़रिया बना… pic.twitter.com/opK5ygMM2W
— Swati Maliwal (@SwatiJaiHind) March 5, 2025
The measure of a man is what he does with power.” – Plato
Arvind Kejriwal, who once pretended to be a common man in a WagonR, now moves in a lavish convoy of bulletproof Land Cruisers, 100+ Punjab Police commandos, jammers & ambulances—like a VIP Maharaja all for Vipassana, a…
— Manjinder Singh Sirsa (@mssirsa) March 5, 2025