నాగర్ కర్నూల్ : దేశంలో జనగణన తోపాటు కులగణన ( Caste census ) చేయడం చారిత్రాత్మకమైన నిర్ణయమని ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ మలికేడి అన్నారు. బీజేపీ( BJP) నాగర్ కర్నూల్ శాఖ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 60 శాతానికి పైగా జనాభా ఉన్న బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ల ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. ఈ నిర్ణయం ఓబీసీలకు గొప్ప గుర్తింపని పేర్కొన్నారు. రాజకీయ సామాజిక విద్య ఉద్యోగాల పరంగా ఓబీసీలకు అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు.
ఈ కార్యక్రమం లో టౌన్ అధ్యక్షులు రాము, ప్రధాన కార్యదర్శి ప్రమోద్,కుమార్, సైదులు,జిల్లా ఆఫీస్ సెక్రటరీ చందు , సీనియర్ నాయకులు యాదగిరిరావు, నాగేంద్ర గౌడ్ తాడుర్ మండల ప్రధాన కార్యదర్శి సుదర్శన్, బీజేవైఎం టౌన్ అధ్యక్షులు చందు , టౌన్ ఉపాధ్యక్షులు పర్వతాలు, ఓబీసీ నేత లక్ష్మయ్య, సూరంపల్లి సుధాకర్, భూత్ అధ్యక్షులు, జజాల కృష్ణ, పరశురామ్, బాలరాజు, సంజయ్, భీమయ్య సూరి బాబు, పాస్తాం బాబు తదితరులు పాల్గొన్నారు