Diwali Discounts for Cars | నవరాత్రి, విజయ దశమి తర్వాత దీపావళి పండుగ సందర్భంగా వివిధ కార్ల తయారీ సంస్థలు కొత్త కార్ల కొనుగోలుదారులకు ఆకర్షణీయ ఆఫర్లు తీసుకొచ్చాయి. దేశంలోని బెస్ట్ సెల్లింగ్ కార్లలో కొన్నింటిపై ఆయా సంస్థలు రూ.లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఆ జాబితాలో టాటా మోటార్స్, మారుతి సుజుకి, హ్యుండాయ్, రెనాల్డ్ వంటి సంస్థలు కార్ల కొనుగోళ్లపై దీపావళి ఆఫర్లు అందిస్తున్నాయి. ఈ ఆఫర్లు కేవలం అక్టోబర్ నెలకు మాత్రమే పరిమితం కానున్నాయి. ఆ ఆఫర్లు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దామా..
కొనా ఎలక్ట్రిక్.. హ్యుండాయ్ ఎలక్ట్రిక్ కంపాక్ట్ ఎస్యూవీ కొనా కారు రూ.23.84-24.03 లక్షల మధ్య అందుబాటులో ఉంది. దీనిపై రూ.లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్లు అందిస్తోంది హ్యుండాయ్.
గ్రాండ్ ఐ10 నియోస్ .. గ్రాండ్ ఐ10 నియోస్ కారు రూ.5.43 లక్షల నుంచి రూ.8.45 లక్షల మధ్య లభిస్తుంది. దీనిపై క్యాష్ డిస్కౌంట్ రూపేణా రూ.35 వేల డిస్కౌంట్, రూ.10 వేల ఎక్స్చేంజ్ బోనస్, టర్బో ఎడిషన్ వేరియంట్‌పై రూ.3000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇదే కారు ఇతర వేరియంట్లపై ఇటువంటి ఆఫర్లే లభిస్తున్నాయి.
ఐ 20 .. హ్యుండాయ్ ఐ20 కారు రూ.10 వేల డిస్కౌంట్‌తోపాటు ఎక్స్చేంజ్ బోనస్ రూపంలో రూ.10 వేల రాయితీ లభ్యం అవుతుంది. మొత్తం రూ.20 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మాగ్నా, స్పోర్ట్జ్ వేరియంట్లకూ ఈ రాయితీలు వర్తిస్తాయి.
ఒరా.. హ్యుండాయ్ సెడాన్ ఒరా-సీఎన్జీ పవర్డ్ వేరియంట్‌పై రూ.33 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఇతర వేరియంట్ కార్లపై గరిష్టంగా రూ.18 వేల వరకు బెనిఫిట్లు పొందొచ్చు.
ఆల్ట్రోజ్.. ప్రస్తుత ఫెస్టివ్ సీజన్లో టాటా ఆల్ట్రోజ్‌పై రూ.20 వేల వరకు బెనిఫిట్లు పొందొచ్చు. రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ ఇందులో ఉన్నాయి. డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ (డీసీఏ) ఫీచర్‌పై ఈ ఆఫర్ పొందలేరు.
హారియర్ .. టాటా హారియర్ కారు రూ.13.84-రూ.21.09 లక్షల మధ్య పొందొచ్చు. దీనిపై ఫెస్టివ్ ఆఫర్ రూపంలో రూ.40 వేల వరకు డిస్కౌంట్ లభ్యం అవుతుంది.
సఫారీ.. టాటా సఫారీ కారు ప్రస్తుతం రూ.14.99-23.19 లక్షల మధ్య పలుకుతున్నది. కేజడ్ఆర్ వేరియంట్ మినహా అన్ని వేరియంట్లపై రూ.40 వేల వరకు రాయితీలు, డిస్కౌంట్లు వస్తాయి. సఫారీ కేజడ్ఆర్పై రూ.20 వేల క్యాష్, రూ.40 వేల ఎక్స్చేంజ్ బోనస్‌తో కలిపి రూ. 60 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
టియాగో.. హ్యాచ్‌బ్యాక్ టియాగో కారు రూ.4.7-రూ.7.05 లక్షల మధ్య లభిస్తుంది. పెట్రోల్ ఏఎంటీ, సీఎన్జీ మోడల్ కార్లపై రూ.30 వేల వరకు డిస్కౌంట్లు పొందొచ్చు.
టైగోర్.. టాటా టైగోర్ సీఎన్జీ కారు ధర రూ.5.39 లక్షల నుంచి రూ.7.82 లక్షల మధ్య లభిస్తుంది. దీనిపై గరిష్టంగా రూ.30 వేల వరకు రాయితీ అందుబాటులో ఉంది.
సియాజ్.. మారుతి సుజుకి సియాజ్ సెడాన్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ వేరియంట్లపై గరిష్టంగా రూ.30 వేల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నది.
ఇగ్నిస్.. మారుతి సుజుకి ఇగ్నిస్ కారు మాన్యువల్ వేరియంట్‌పై రూ.10 వేల క్యాష్ డిస్కౌంట్ పొందొచ్చు. ఆటోమేటిక్ వేరియంట్ కారుపై గరిష్టంగా రూ.20 వేల డిస్కౌంట్ లభిస్తుంది.
ఎస్ – ప్రెస్సో.. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో మాన్యువల్ వేరియంట్ కారుపై అత్యంత గరిష్టంగా రూ.56 వేల డిస్కౌంట్ పొందొచ్చు.
డిజైర్.. మారుతి సుజుకి డిజైర్ సెడాన్ కారు ఏఎంటీ వేరియంట్ మీద రూ.52 వేల వరకు డిస్కౌంట్ లభ్యం అవుతుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్ మీద రూ.17 వేల డిస్కౌంట్ అందిస్తున్నది.
ఆల్టో 800.. మారుతి సుజుకి తన ఆల్టో 800 కారుపై మొత్తం రూ.36 వేల డిస్కౌంట్ పొందొచ్చు. ఎంట్రీ లెవెల్ ట్రిమ్ కారుపై రూ.11 వేల వరకే రాయితీ లభిస్తుంది.
సెలెరియో.. మారుతి సుజుకి సెలెరియో మాన్యువల్ వేరియంట్ కారుపై గరిష్టంగా మొత్తం రూ.51 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏఎంటీ మోడల్ కారుపై రూ.41 వేలు, సెలెరియో సీఎన్జీ వేరియంట్‌పై రూ.10 వేల రాయితీ మాత్రమే లభిస్తుంది.
స్విఫ్ట్.. మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ఏఎంటీ వేరియంట్‌పై రూ.47 వేలు, మాన్యువల్ వేరియంట్‌పై రూ.30 వేల డిస్కౌంట్లు లభ్యం అవుతున్నాయి.
ఆల్టో కే 10.. మారుతి సుజుకి న్యూ ఆల్టో కే 10 ఏఎంటీ, మాన్యువల్ వేర్షన్ కార్లపై గరిష్టంగా రూ.39,500 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ట్రైబర్.. 4-మీటర్స్ సబ్ మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీ) ట్రైబర్ కారుపై మొత్తం రూ.50 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ బెనిఫిట్లు రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్లు రూ.10 వేలు అందిస్తున్నది.
క్విడ్ .. 2019లో వచ్చిన క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌పై గరిష్టంగా రూ.35 వేల డిస్కౌంట్లు లభిస్తాయి. క్యాష్ బెనిఫిట్ రూపేణా రూ.10వేలు, ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూపంలో రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్‌గా రూ.10 వేలు లభిస్తుంది. 0.8 లీటర్ల వర్షన్ కారుపై ఎక్స్చేంజ్ బెనిఫిట్ రూ.10 వేలు మాత్రమే లభిస్తుంది.
కైగర్.. రెనాల్ట్ కైగర్ అప్డేటెడ్ కంపాక్ట్ ఎస్యూవీ కారుపై గరిష్ఠంగా రూ.10 వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ పొందొచ్చు.