హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : ఎక్సైజ్‌శాఖలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త సర్వీస్‌రూల్స్ అమలుచేయాలని, ఖాళీ పోస్టులు భర్తీచేయాలని కోరింది.
10 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌కు సమర్పించింది.