హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై ఓ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిరోజూ విధులకు వెళ్లేందుకు ఉపయోగించే క్యాబ్ డ్రైవరే ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది.
రోజూ విధులకు వెళ్లే క్యాబ్‌లోనే సదరు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని ఇంటి నుంచి బయల్దేరగా.. కారును ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో ఒక నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అయితే సదరు ఉద్యోగిని ధైర్యంగా ప్రతిఘటించింది. దీంతో పట్టుబడతాననే భయంతో నిందితుడు అక్కడి నుంచి వాహనంతో పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధితురాలు వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.