ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం.. రోజూ వెళ్లే క్యాబ్‌లోనే దారుణం!
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై ఓ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు.
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై ఓ క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిరోజూ విధులకు వెళ్లేందుకు ఉపయోగించే క్యాబ్ డ్రైవరే ఈ దారుణానికి ఒడిగట్టడం కలకలం రేపింది.
రోజూ విధులకు వెళ్లే క్యాబ్‌లోనే సదరు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగిని ఇంటి నుంచి బయల్దేరగా.. కారును ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో ఒక నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించాడు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు. అయితే సదరు ఉద్యోగిని ధైర్యంగా ప్రతిఘటించింది. దీంతో పట్టుబడతాననే భయంతో నిందితుడు అక్కడి నుంచి వాహనంతో పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధితురాలు వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

