Parliament: నల్ల దుస్తులతో విపక్ష ఎంపీల నిరసన ప్రదర్శన.. ఉభయసభలు 12 గంటల వరకు వాయిదా
Parliament: విపక్ష ఎంపీలు ఇవాళ నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరో వైపు ఉభయసభలు మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా పడ్డాయి.
న్యూఢిల్లీ: మూడో రోజు కూడా పార్లమెంట్(Parliament)లో సేమ్ సీన్ రిపీటైంది. ఇవాళ లోక్సభ, రాజ్యసభలో గందరగోలం నెలకొన్నది. దీంతో రెండు సభలు 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని లోక్సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. సభను ఆర్డర్లోకి తెచ్చేందుకు స్పీకర్ ఓం బిర్లా ప్రయత్నించారు. కానీ ఫలితం కాలేదు. ప్రశ్నోత్తరాల సమయం జరిగే రీతిలో విపక్షాలు సహకరించాలని ఆయన కోరారు. ఎటువంటి సమస్యపైన అయినా చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఖర్గే అన్నారు. కానీ విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. నినాదాలు చేశారు. దీంతో సభను 12 వరకు వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా విపక్షాలు సీజేపీ లాఠీచార్జ్ అంశాన్ని చర్చించాలని పట్టుపట్టాయి. కానీ చైర్మెన్ సీపీ రాధాకృష్ణన్ వ్యతిరేకించారు. గందరగోళ నేపథ్యంలో సభను 12 వరకు వాయిదావేశారు.
మరో వైపు విపక్ష ఎంపీలు ఇవాళ నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు. నీట్ పేపర్ లీకేజీ అంశంలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీఛార్జ్కు నిరసనగా నల్ల దుస్తులు ధరించినట్లు కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా ఆరోపించారు.
#WATCH | Delhi: Wearing black clothes, Opposition MPs protest on the Parliament premises.
Earlier this morning, Congress MP Pawan Khera told ANI that all Opposition MPs are wearing black today as a mark of “protest against what they have done to the students of this country in… pic.twitter.com/ov8Q26p6hL
— ANI (@ANI) July 22, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

