David Warner: డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో డేవిడ్ వార్నర్..
David Warner: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్.. డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఈస్టర్ సండే రోజున మద్యం సేవించి వాహనం నడిపారు. స్వల్ప స్థాయిలో మద్యం తీసుకున్నట్లు వార్నర్ అంగీకరించాడు. ఆగస్టు 18వ తేదీన శిక్ష ఖరారు కానున్నది.
సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) .. డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఈస్టర్ సండే రోజున మద్యం సేవించి వాహనం నడిపారు. అయితే పోలీసు చెకింగ్‌లో అతను చిక్కాడు. ఆస్ట్రేలియా జట్టు మాజీ ఓపెనర్ వార్నర్.. ప్రస్తుతం టీ20 బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నారు. బ్రీతింగ్ టెస్టులో వార్నర్‌కు పాజిటివ్‌గా తేలింది. అయితే డ్రంకెన్ డ్రైవింగ్ కేసులో వార్నర్ ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుకాలేదు. ఆయన తరపున లాయర్ బాబీ హిల్ కోర్టుకు హాజరయ్యారు. మద్యం సేవించిన విషయాన్ని వార్నర్ అంగీకరిస్తున్నట్లు లాయర్ బాబీ తెలిపారు. మీరు వ్యాపారి అయినా, డాక్టర్ అయినా, బెస్ట్ ఓపెనింగ్ బ్యాటర్ అయినా.. డ్రంకెన్ డ్రైవింగ్‌తో అందరికీ ప్రమాదమే అని కోర్టు తన వాదనల్లో పేర్కొన్నది. అయితే ఆగస్టు 18వ తేదీన ఈ కేసులో కోర్టు తుది తీర్పును వెలువరించనున్నది. మద్యం తాగిన కేసులో దొరికిన డేవిడ్ వార్నర్‌కు.. సిడ్నీ థండర్స్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయే అవకాశం ఉన్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

