దుబాయి : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారత్కు యునైట్ అరబ్ ఎమిరేట్స్ ఆదివారం సంఘీభావం ప్రకటించింది. దుబాయిలోని ప్రతిష్ఠాత్మకమైన, ప్రపంచంలోనే ఎత్తైన కట్టడమైన బుర్జ్ ఖలీపాపై భారత త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది. ఈ క్లిష్ట సమయంలో భారత్కు మద్దతుగా నిలిచేందుకు ఆదివారం రాత్రి బుర్జ్ ఖలీఫాపై ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ సందేశమిచ్చింది. ఈ వీడియోను బుర్జ్ ఖలీఫా ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
Tonight we stand in solidarity with #India 🇮🇳. Prominent landmarks in the UAE display the Indian flag as India #Delhi fights #covid19 #StayStrongIndia 🇦🇪 🇮🇳 #CovidIndia pic.twitter.com/zgQTbQRmKL
— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) April 25, 2021
‘ఈ సవాలు సమయంలో భారతదేశానికి, ప్రజలందరికీ ఆశలు, ప్రార్థనలు పంపడంతో పాటు మద్దతును తెలుపుతుందని పేర్కొంది. బుర్జ్ ఖలీఫాతో పాటు అబుదాబిలోని అడ్నోక్ ప్రధాన కార్యాలయాలు భారత జెండాతో పాటు ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ సందేశంతో కాంతులీనాయి. కష్ట సమయంలో యూఏఈ తన మిత్ర దేశానికి ఇచ్చిన బలమైన మద్దతును భారత్ అభినందిస్తుందని యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ ట్వీట్ చేశారు.
نرسل رسالة أملٍ وتضامن ودعم للشعب الهندي في هذه الأوقات العصيبة، متمنين أن يتخطوا هذه المحنة بقوتهم واتحادهم#برج_خليفة
— Burj Khalifa (@BurjKhalifa) April 25, 2021
Sending hope, prayers, and support to India and all its people during this challenging time. #BurjKhalifa #StayStrongIndia pic.twitter.com/y7M0Ei5QP5