గోతులమయంగా బూర్గంపహాడ్- సారపాక, సారపాక- ఇరవెండి రహదారులు
ఈ దారిలో ప్రయాణం అంటే నరకయాతనే. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే ఈ రహదారి గుండానే భక్తులు, పర్యాటకులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మరో రహదారి ఉన్నప్పటికీ...
– పట్టించుకోని అధికారగణం
– వాహనదారుల, ప్రజల అవస్థలు
బూర్గంపహాడ్, నవంబర్ 02 : ఈ దారిలో ప్రయాణం అంటే నరకయాతనే. దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లాలంటే ఈ రహదారి గుండానే భక్తులు, పర్యాటకులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయంగా మరో రహదారి ఉన్నప్పటికీ ఎక్కువగా బూర్గంపహాడ్ మండల కేంద్రం మీదుగా సారపాక నుండి భద్రాచలం వాహనాలు ప్రయాణించాల్సి ఉంటోంది. జాతీయ రహదారిగా ఉన్న బూర్గంపహాడ్-సారపాక రహదారి గోతులతో ప్రయాణీకులు, వాహనదారులకు యమపాశాలుగా మారింది. వేలాది వాహనాలు నిత్యం ఈ రహదారిపై ప్రయాణిస్తుంటాయి. బూర్గంపహాడ్ నుంచి సారపాకకు ఐదు కిలోమీటర్ల దూరం ఉండగా దారంతా ఎక్కడ పడితే పెద్ద పెద్ద గోతులు దర్శనమిస్తుండటంతో రాకపోకలు సాగించే వాహనదారులు ఈ దారిలో ప్రయాణానికి నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా సారపాక- ఇరవెండి ప్రధాన రహదారిలో సైతం కిలోమీటరు పొడవునా గోతులతో వాహనదారులు ప్రయాణించాలంటే అరిగోస పడుతున్నారు.

గోతులమయంగా బూర్గంపహాడ్- సారపాక, సారపాక- ఇరవెండి రహదారులు
రాత్రి సమయాల్లో ఈ రహదారిలో ప్రయాణం యమగండమే. పలుమార్లు ఈ రహదారుల్లో వాహనదారులు ప్రమాదాలకు గురైన సంఘటనలూ లేకపోలేదు. సంబంధిత అధికారులు మూడేళ్ల కాలంలో ఈ రహదారికి అడపా దడపా ప్యాచ్ వర్క్ లు చేయడమే తప్ప పూర్తిస్థాయిలో శాశ్వత మరమ్మతులు చేపట్టలేదు. గోతులమయంతో ఉన్న రహదారుల దుస్థితిపై గతంలో బీఅర్ఎస్ తో పాటు సీపీఎం ఇతర పార్టీల నాయకులు సైతం ఆందోళనలు చేపట్టిన సంఘటనలూ కోకొల్లలు. రహదారుల విషయంలో సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారే తప్ప పరిష్కారం చూపడం లేదని ప్రయాణీకులు, వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు రహదారుల దుస్థితిపై శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు, ప్రయాణీకులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dia Mirza: దియా మీర్జా దివాళీ వీడియో డిలీట్ చేసిన బీఎంసీ
గోతులమయంగా బూర్గంపహాడ్- సారపాక, సారపాక- ఇరవెండి రహదారులు
YS Jagan | ఏపీ ఎన్నికల సంఘంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Khawaja Asif | మా దేశ ఫారిన్ పాలసీని నడిపిస్తున్నది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పిన పాకిస్థాన్ రక్షణ మంత్రి
రక్తదానం ప్రాణదానంతో సమానం : డీఎస్పీ శివరాం రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

