YS Jagan | ఏపీ ఎన్నికల సంఘంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan | ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్యమంత్రి చంద్రబాబు కు తొత్తుగా మారిపోయిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. ఆ
అమరావతి : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (Election Commission), ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu )కు తొత్తుగా మారిపోయిందని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) విమర్శించారు. ఆదివారం ఏపీలో జరిగిన పురపాలక ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై సోమవారం ట్విట్ చేశారు. ఎన్నికల్లో అక్రమాలకు ఎస్ఈసీ ఎంతలా అండగా నిలుస్తోందో చెప్పడానికి పులివెందులలో 80 పోలింగ్ బూత్‌ల్లో 70 చోట్ల వైయస్సార్సీపీకి చెందిన ఏజెంట్లను లేకుండా చేసిన ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యమని పేర్కొన్నారు.
ఎన్నికల అధికారులు, పోలీసుల అండదండలతో బయట ప్రాంతాలనుంచి వచ్చిన టీడీపీ గూండాలు స్వైరవిహారం చేశారని ఆరోపించారు. వైసీపీకి చెందిన ఏజెంట్లు, బూత్‌ల్లోకి పోకుండా దాడులు చేసి, ఇంకొన్నిచోట్ల ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు లాగేశారని పేర్కొన్నారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని, బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్, సైక్లింగ్ చేశారని వివరించారు. ఈ దారుణాలకు సంబంధించిన వీడియో ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయన్నారు. 70 బూత్‌ల్లో అక్రమాలు జరిగితే, దాడులు చేసి, అక్కడనుంచి ఏజెంట్లనే తరిమేస్తే, కేవలం 4 బూత్‌ల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.
కడప, అనంతపురం, తిరుపతి, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లలోతో సహా పలు మున్సిపాల్టీల్లోనూ యథేచ్ఛగా ఎన్నికల అక్రమాలు జరిగాయని వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. అక్రమాలకు సంబంధించిన ప్రతి ఆధారాన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఆలస్యం కావొచ్చేమోగాని, చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయని దీమాను వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీ ఎన్నికల సంఘంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
Khawaja Asif | మా దేశ ఫారిన్ పాలసీని నడిపిస్తున్నది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పిన పాకిస్థాన్ రక్షణ మంత్రి
రక్తదానం ప్రాణదానంతో సమానం : డీఎస్పీ శివరాం రెడ్డి
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

