Khawaja Asif | మా దేశ ఫారిన్ పాలసీని నడిపిస్తున్నది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పిన పాకిస్థాన్ రక్షణ మంత్రి
Khawaja Asif | పాకిస్థాన్ (Pakistan) విదేశాంగ విధాన నిర్ణయాల్లో (Foreign Policy) ఆ దేశ సైన్యం కీలకపాత్ర పోషిస్తున్నది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణమంత్రి (Defence Minister) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) స్వయంగా వెల్లడించారు. పౌర ప్రభుత్వం, సైనిక నాయకత్వం కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయని తెలిపారు. దేశంలో అమలవుతున్నది సంప్రదాయ ప్రజాస్వామ్య పాలన కాదని, ఇది ఒక ‘హైబ్రిడ్ వ్యవస్థ’ అని చెప్పారు.
Khawaja Asif : పాకిస్థాన్ (Pakistan) విదేశాంగ విధాన నిర్ణయాల్లో (Foreign Policy) ఆ దేశ సైన్యం కీలకపాత్ర పోషిస్తున్నది. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణమంత్రి (Defence Minister) ఖవాజా ఆసిఫ్ (Khawaja Asif) స్వయంగా వెల్లడించారు. పౌర ప్రభుత్వం, సైనిక నాయకత్వం కలిసి అధికారాన్ని పంచుకుంటున్నాయని తెలిపారు. దేశంలో అమలవుతున్నది సంప్రదాయ ప్రజాస్వామ్య పాలన కాదని, ఇది ఒక ‘హైబ్రిడ్ వ్యవస్థ’ అని చెప్పారు.
బ్రిటిష్-అమెరికన్ జర్నలిస్ట్ మెహ్దీ హసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో సైన్యాధిపతి అసిమ్ మునీర్‌కు ప్రభుత్వ పెద్దలకంటే ఎక్కువ అధికారం ఉందా..? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. సైన్యం, పౌర నాయకత్వం మధ్య నిర్ణయాలు ఏకాభిప్రాయంతో జరుగుతాయని చెప్పారు. అయితే అధికార పంపిణీ సమానంగా లేదని అంగీకరించారు. దేశంలో సైన్యం పాత్రను ప్రస్తావిస్తూ.. గతంలో సైనిక పాలకుల కారణంగా ఈ వ్యవస్థ మరింత స్పష్టంగా కనిపించిందని ఆసిఫ్ అన్నారు.
అమెరికాలోనూ ప్రభుత్వ నిర్ణయాల వెనుక ‘డీప్ స్టేట్’ ఉందని వ్యాఖ్యానించారు. అయితే పాకిస్థాన్‌లో ప్రస్తుతం సైనిక పాలన లేదని, సైన్యం ఎన్నికైన ప్రభుత్వానికి సహకరిస్తోందని ఆయన గతంలో కూడా పలుమార్లు సమర్థించారు. 2025లో అరబ్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆసిఫ్ పాకిస్థాన్ పాలనా విధానాన్ని ‘హైబ్రిడ్ మోడల్’ గా అభివర్ణించారు. సైనిక, పౌర నాయకత్వం కలిసి అధికారాన్ని నిర్వహిస్తున్నాయని, ఆర్థిక, పాలనా సమస్యల నుంచి దేశం బయటపడే వరకు ఈ విధానం అవసరమని పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Khawaja Asif | మా దేశ ఫారిన్ పాలసీని నడిపిస్తున్నది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పిన పాకిస్థాన్ రక్షణ మంత్రి
రక్తదానం ప్రాణదానంతో సమానం : డీఎస్పీ శివరాం రెడ్డి
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

