రక్తదానం ప్రాణదానంతో సమానం : డీఎస్పీ శివరాం రెడ్డి
రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం ప్రాణదానంతో సమానమని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. సమాజ సేవలో భాగంగా యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని...
కట్టంగూర్, నవంబర్ 02 : రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, రక్తదానం ప్రాణదానంతో సమానమని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. సమాజ సేవలో భాగంగా యువత, ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం కట్టంగూర్ మండల కేంద్రంలోని బీఎన్ గౌడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) 7వ జిల్లా మహాసభల రెండవ రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో రక్తం అందక ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రక్తదానం చేయడం వల్ల దాతలకు ఎలాంటి నష్టం ఉండదని, నిర్ణీత వ్యవధిలో రక్తదానం చేయడం ఆరోగ్యకరమైన సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘం మహాసభల సందర్భంగా విద్యారంగ సమస్యలపై చర్చించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా, రాష్ట్ర నాయకులు, ఉపాధ్యాయులు, రక్తదాతలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రక్తదానం ప్రాణదానంతో సమానం : డీఎస్పీ శివరాం రెడ్డి
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

