Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
Tollywood Small Films | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ చిత్రాలు మరియు చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న తీవ్రమైన థియేటర్ల కొరత, విడుదల అడ్డంకులను శాశ్వతంగా పరిష్కరించేందుకు తక్షణమే ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని నటుడు, దర్శకుడు షిరాజ్ మెహదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ చిత్రాలు మరియు చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న తీవ్రమైన థియేటర్ల కొరత, విడుదల అడ్డంకులను శాశ్వతంగా పరిష్కరించేందుకు తక్షణమే ఒక ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని నటుడు, దర్శకుడు షిరాజ్ మెహదీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్థానిక బెంగాలీ చిత్రాలకు ప్రైమ్‌టైమ్‌లో తప్పనిసరిగా ప్రదర్శన అవకాశం కల్పిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక విలేకరుల సమావేశంలో (ప్రెస్‌మీట్) టాలీవుడ్లో చిన్న సినిమాల మనుగడకు ఎదురవుతున్న సవాళ్లను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా షిరాజ్ మెహదీ తన సినీ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, 2012లో విడుదలైన ‘పార్సెల్’ చిత్రంతో హీరోగా పరిచయమై, ఆ తర్వాత నటన, దర్శకత్వం, సంగీతం, పంపిణీ వంటి విభిన్న విభాగాల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం తనకుందని తెలిపారు. నేటి కాలంలో కొత్తగా సినిమాలు నిర్మించేవారు కేవలం కథ, చిత్రీకరణలపైనే దృష్టి పెట్టకుండా, సినిమా విడుదల ప్రక్రియ, థియేటర్ వ్యాపార మెలకువలు, మార్కెటింగ్ వ్యూహాలపైనా పూర్తి అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ పనితీరుపై షిరాజ్ మెహదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్న నిర్మాతలకు ఛాంబర్ నుంచి తగిన మార్గదర్శకత్వం గానీ, వ్యాపారపరమైన సహకారం గానీ అందడం లేదని ఆయన విమర్శించారు. నిర్మాతల నుంచి సభ్యత్వ రుసుములు వసూలు చేస్తున్నప్పటికీ, వారు ఆర్థికంగా మరియు విడుదల పరంగా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు అండగా నిలవడంలో విఫలమవుతోందని ఆరోపించారు. గత ఏడాదిన్నర కాలంగా తాను ఈ అన్యాయాలపై ఒంటరి పోరాటం చేస్తున్నానని, ఈ క్రమంలో పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ ఫిలిమ్స్‌తో పాటు పరిశ్రమలోని పలువురికి న్యాయపరమైన నోటీసులు కూడా జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. తన న్యాయపోరాటానికి ఇప్పుడు పలువురు చిన్న నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారుల నుంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు.
సినీ నిర్మాణంలో ఆర్థిక నష్టాలు ఎదురైనంత మాత్రాన ఎవరూ ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని షిరాజ్ మెహదీ భావోద్వేగపూరితంగా విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలో ఏవైనా అన్యాయాలు లేదా వేధింపులు ఎదురైతే కుంగిపోకుండా శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రెస్మీట్ల ద్వారా తమ సమస్యలను సమాజం ముందుంచాలని, ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని చిన్న సినిమాల సమస్యల పరిష్కారానికి కఠిన చర్యలు చేపట్టాలని, పశ్చిమ బెంగాల్ తరహాలో ఇక్కడి థియేటర్లలో స్థానిక సినిమాలకు ప్రాధాన్యత కల్పించే విధానాన్ని అమలు చేయాలని కోరారు. అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ వ్యవహారాలపై స్పందిస్తూ, పరిశ్రమ అభివృద్ధికి నిజాయితీగా పనిచేసే వారే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండాలని స్పష్టం చేస్తూ, సి. కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్‌తో పాటు మల్టీప్లెక్స్‌లోని ప్రతి తెరపై మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య రోజుకు కనీసం ఒక బెంగాలీ సినిమా ప్రదర్శన తప్పనిసరి చేస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, నిబంధనలు ఉల్లంఘిస్తే థియేటర్ల లైసెన్సుల రద్దు వరకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందని ఆయన గుర్తు చేశారు. స్థానిక చిత్రాలకు సరైన ప్రదర్శన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోనూ అమలు చేస్తే ఎందరో చిన్న నిర్మాతలకు, కళాకారులకు జీవనోపాధి లభిస్తుందని షిరాజ్ మెహదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

