వికారాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) కొత్త అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా జిల్లాలో రైతుల పోరాటం ఉధృతమైంది. ప్రభుత్వం ట్రిపులార్ అలైన్మెంట్ వివరాలను మ్యాపుతో సహా హెచ్ఎండీఏ వెబ్సైట్లో పొందుపర్చిన మరుసటి రోజు నుంచే అన్నదాతలు ఉద్యమిస్తున్నారు. రోజుకొక్క మండలానికి చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. పాత అలైన్మెంట్ ప్రకారమే రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని, కొత్త అలైన్మెంట్ వద్దే.. వద్దంటూ రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుని జీవిస్తున్న భూములను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. సన్న, చిన్నకారు రైతులకు ఉన్న ఒకట్రెండు ఎకరాల భూమి కూడా రీజినల్ రింగ్‌రోడ్డులో కోల్పోతే తమ బతుకులు ఆగమవుతాయని, రోడ్డున పడాల్సి వస్తుందని కన్నీంటిపర్యంతమవుతున్నారు.
ట్రిపులార్ కొత్త అలైన్మెంట్ పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు ఎకరం రూ. కోట్లలో ఉండడం.. రీజినల్ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోతే ప్రభు త్వం అందజేసే అరకొర సాయంతో చాలా నష్ట పోతామంటూ అన్నదాతలు తమ భూములను రోడ్డు నిర్మాణానికి ఇచ్చేందుకు ముందుకు రావడంలేదు. ఉన్న కాస్త భూమి కూడా పోతే తాము రోడ్డు న పడాల్సి వస్తుందని.. బిచ్చమెత్తాల్సి వస్తుందని.. అందుకోసం తమ భూ ములను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెబుతున్నారు. అవసరమైతే తమ ప్రాణాలైనా ఇస్తామని పేర్కొంటున్నారు. అదేవిధంగా రీజినల్ రింగ్‌రోడ్డుకు ప్రతిపాదించిన కొత్త అలైన్మెంట్లో చాలావరకు పట్టా భూముల మీదుగా అలైన్‌మెంట్‌ను రూపొందించడంతో భూములు కోల్పోతున్న రైతులు జిల్లా ఉన్నతాధికారులు, హెచ్ఎండీఏ అధికారులతోపాటు ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలం టూ విన్నవిస్తున్నారు.
ఇప్పటికే రీజినల్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ ప్రతిపాదనలో జిల్లాలోని నాలుగు మండలాల్లోని 22 గ్రామాల మీదుగా సర్వే నంబర్లతో సహా నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లాలో ని పూడూరు మండలంలోని 11 గ్రామాల రైతులు, మోమిన్‌పేట మండలంలోని దేవరంపల్లి గ్రామానికి చెందిన రైతులు, నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామ రైతులు తమ పట్టా భూములను కోల్పోవాల్సి వస్తున్నదని.. ప్రభుత్వం స్పందించి కొత్త అలైన్‌మెంట్‌ను ప్రభుత్వ, అసైన్డ్ భూముల మీదుగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.