14 కాలేజీల్లో ఈవెనింగ్ బీటెక్
ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్న బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పలు కాలేజీలు ముందుకు వస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం 14 కాలేజీల్లో బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
- ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో తొలిసారి కామన్ ఎంట్రెన్స్
హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్న బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పలు కాలేజీలు ముందుకు వస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరం 14 కాలేజీల్లో బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. గతంలో 11 కాలేజీల్లో మాత్రమే ఈ కోర్సులుండగా, తాజాగా మరో మూడు కాలేజీల్లో ఈ కోర్సులకు అనుమతినిచ్చారు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో మొత్తంగా 1,170 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. బ్రాంచీల వారీగా ఈసీఈలో అత్యధికంగా 195, ఈఈఈ 165, మెకానికల్ 150, సీఎస్ఈలో150 చొప్పున సీట్లు ఉన్నాయి.
ఓయూ ఆధ్వర్యంలో తొలిసారి ఎంట్రెన్స్..
పాలిటెక్నిక్ చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డ వారికి బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. డిప్లొమా హోల్డర్లు ఉద్యోగానికి ఆటంకం ఏర్పడకుండా రెండో సంవత్సరంలో చేరి, మూడేండ్లల్లోనే బీటెక్ కోర్సును పూర్తి చేసుకోవచ్చు. బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులో ప్రవేశాలకు తొలిసారిగా రాష్ట్రస్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకి అప్పగించారు. ఈ ప్రవేశ పరీక్షకు టీజీ ఈసెట్(డబ్ల్యూపీ) అనే పేరును ఖరారు చేశారు. ఈ పరీక్షను ఆగస్టు 30న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

