Constable Attack | మద్యం మత్తులో ఓ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లా ఉర్సు గుట్టలో ఓ బీట్ కానిస్టేబుల్ మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఓ బార్లో మద్యం తాగి బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడని బార్ సిబ్బంది 112కి డయల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి వెంటనే బార్ వద్దకు వెళ్లి బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి చెంపపై కొట్టాడు. దీంతో బెటాలియన్ కానిస్టేబుల్ తిరిగి బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించాడు. ఈ క్రమంలో బెటాలియన్ కానిస్టేబుల్‌ను సంతోష్ రెడ్డి, స్థానికులతో కలిసి లాఠీతో చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Smart ration cards | తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ.. హరిపురంలో కార్డుల పంపిణీ నిలిపివేత