మొయినాబాద్ డిసెంబర్ 25 : సెలూన్ షాపులో పనిచేస్తున్న ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..మొయినాబాద్ మండల పరిధిలోని వెంకటపూర్ గ్రామానికి చెందిన జంపుల రంగయ్య పెద్ద కుమారుడు మహేష్ (24) శంషాబాద్ మండల పరిధిలోని కవేలిగూడ చౌరస్తా వద్ద ఉన్న తన పెద్దనాన్న కటింగ్ షాపులో పనిచేస్తాడు.
ఈ వృత్తి నిర్వహించుకుంటూ అదనం సంపాదన కోసం మ్యూజిక్ బ్యాండ్ నిర్వాణ కూడా చేస్తుంటాడు. అయితే బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. కవేలిగూడ చౌరస్తా నుంచి సుమారుగా అర కిలోమీటర్ దూరంలో ఉన్న వెంచర్ లోనికి తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.