Gellu Srinivas | బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్‌ను ముందస్తుగా అరెస్టు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కొంతకాలంగా బీఆర్ఎస్వీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్వీ నాయకులు ధర్నా చేస్తారనే భయంతో ఆయన్ను ఇంట్లోనే నిర్బంధించారు.
రాష్ట్రంలో విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించాడని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో విద్యాశాఖకు చేసింది శూన్యమని విమర్శించారు. పోలీసులు నిర్బంధాలతో విద్యార్థి ఉద్యమాలను అణిచివేయలేరని స్పష్టం చేశారు.