Gellu Srinivas | బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ హౌస్ అరెస్టు
Gellu Srinivas | బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్‌ను ముందస్తుగా అరెస్టు చేశారు.
Gellu Srinivas | బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న విద్యా వారోత్సవాల కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో గెల్లు శ్రీనివాస్‌ను ముందస్తుగా అరెస్టు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కొంతకాలంగా బీఆర్ఎస్వీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్వీ నాయకులు ధర్నా చేస్తారనే భయంతో ఆయన్ను ఇంట్లోనే నిర్బంధించారు.
రాష్ట్రంలో విద్యాశాఖను సీఎం రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించాడని గెల్లు శ్రీనివాస్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో విద్యాశాఖకు చేసింది శూన్యమని విమర్శించారు. పోలీసులు నిర్బంధాలతో విద్యార్థి ఉద్యమాలను అణిచివేయలేరని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

