ఐనవోలు, ఏప్రిల్ 21: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని, ఏ సర్వే చూసినా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్సే గెలువబోతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు వస్తలేవని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న పథకాలు ఇంకా మొదలే కాలేదని విమర్శించారు. కడియం శ్రీహరి లాగా అధికారం కోసం తాను పార్టీ లు మారే మనిషిని కాదని గుర్తుచేశారు. ఎంపీ అభ్యర్థి సుధీర్‌కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీలో తాను ఒక సామాన్య కార్యకర్తనని, తన సేవలను గుర్తించి కేసీఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న 100 రోజుల్లోనే తాగడానికి, పంటకు నీళ్లు, కరెం టు ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్నదని మండిపడ్డారు. హక్కులు దక్కాలంటే.. కేంద్రంతో కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ ఉండాలని పేర్కొన్నారు. జిల్లా నాయకులు వాసుదేవరెడ్డి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.