మక్తల్, ఏప్రిల్ 12: తెలంగాణ ఉద్యమ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ ఆవిర్భావ సభ పోస్టర్లు నియోజకవర్గం అంతా గులాబీ మయమయ్యాయి. మక్తల్ (Maktal) మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సారద్యంలో ఓరగల్లు రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ సభ తేదీ, సమయం తెలియాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో గోడపత్రికలను అంటించేలా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రామలింగం, బండారి ఆనంద్.. మాట్లాడుతూ మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 27 న వరంగల్లో జరిగే భారత రాష్ట్ర సమితి 25వ ఆవిర్భావ సభ విజయవంతం కోసం గోడపత్రికల పంపిణీ చేపట్టడం జరిగిందన్నారు.
ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త గులాబీ బాస్ ఓరుగల్లు సభలో చెప్పే సందేశాన్ని వినేందుకు వేలాది సంఖ్యలో సైనికుల్లాగా తరలివచ్చే విధంగా కార్యకర్తలను సమన్వయం చేసేందుకు మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ప్రతి కార్యకర్త రామన్న ఆదేశాలను జవదాటకుండగా పార్టీ పటిష్టత కోసం నిరంతరాయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఓరుగల్లులో జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభనకు మక్తల్ నియోజకవర్గం నుండి రామన్న సారధ్యంలో వేలాదిగా గులాబీ సైనికులు తరలివెళ్లి సభను విజయవంతం చేసేందుకు నిరంతరప్రాయంగా కార్యకర్తలను సిద్ధం చేసేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. మక్తల్ మండలం రుద్రసముద్రం గ్రామంలో గొర్ల కాపరులకు ఓరుగల్లు విజయోత్సవ సభ పోస్టర్లను అందించడంతో.. గొర్ల కాపరులు కేసీఆర్పై ఉన్న మమకారాన్ని చూపిస్తూ తమ జీవనాధారమైన గొర్రె పిల్లలకు ఓరుగల్లు విజయోత్సవ సభ పోస్టర్ను అతికించుకొని ఎంతో సంబురపడ్డారు.