చరిత్ర కడుపున పుట్టింది ఉద్యమాగ్ని శిశువూ
అది తెలంగాణ తలరాతను మార్చిన నవవసంత రుతువూ
వివక్ష దోపిడి విలయంలో విలవిల లాడిన వేదన
అస్తిత్వంకై ఆరాటపడిన ఆత్మగౌరవ భావన
పిడికిలెత్తిన కేసీఆర్ గొంతులో ప్రళయ గర్జన
బీఆర్ఎస్ – బీఆర్ఎస్ – బీఆర్ఎస్
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
నినదించె రుద్రవీణ
నిధులూ నీళ్ళూ నియామకాలు అన్నీ నిలువు దోపిడీ
పిడికిలెత్తితే కాల్చి చంపిన రక్తచరిత్రల రాపిడీ
పదవుల కోసం పెదవులు మూసిన మోసాలతోనె గోస
తెలగాణ రేశాన్ని చూపిన కేసీఆరె మణిపూస
అమరుల మెడలో పూల దండనే – గులాబీ జెండగ మార్చిండూ
ప్రజల కోసమై పదవుల నొదిలీ పోరుబాటనే పట్టిండూ
బీఆర్ఎస్ – బీఆర్ఎస్ – బీఆర్ఎస్
జై తెలంగాణ! జైజై తెలంగాణ!!
జైజై తెలంగాణ నినదించె రుద్రవీణసత్యాగ్రహమే శస్త్రమై – అహింసయే తన అస్త్రమై
ప్రజాశక్తినే ప్రదర్శించిన బహిరంగ సభల చేతనం
రహదారులనే దిగ్బంధించిన జాగృత జన జయ కేతనం
సమరాంగణమున సకలజనులను ఏకం చేసిన నైపుణ్యం
కేసీఆరు దీక్షపూనితే దిగివచ్చిందీ ఢిల్లీ
జోహారన్నది ప్రతి హృదయం- అమర వీరులకు ప్రణమిల్లి
బీఆర్ఎస్ – బీఆర్ఎస్ – బీఆర్ఎస్
జై తెలంగాణ జైజై తెలంగాణ
జైజై తెలంగాణ నినదించె రుద్రవీణ
అర్ధ శతాబ్దపు ఆశయ సాధన నూతన రాష్ట్ర అవతరణం
నవశకానికి నాంది పలికినది కేసీఆర్ సారథ్యం
బీడు భూముల దాహం తీర్చెను గోదారి కృష్ణ నీళ్ళు
తుడుచుకున్నది తెలంగాణము తరతరాల కన్నీళ్లు
ఆకలి కేకల తెలంగాణమూ అన్నపూర్ణగా మారిందీ
అభ్యుదయంలో సంక్షేమంలో అగ్రపథానికి చేరిందీ
బీఆర్ఎస్ – బీఆర్ఎస్ – బీఆర్ఎస్
బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ విజయోత్సవం
-దేశపతి శ్రీనివాస్
శాసనమండలి సభ్యులు