నియోకవర్గ స్థాయిలో స్పీకర్‌కు పోస్టు కార్డులు పంపిస్తాం
ప్రతి గ్రామం నుండి పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం
కడియం రాజీనామ చేయకుంటే మరో సకల జనుల సమ్మె చేపడతాం
BRS | స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 18 : బీఆర్ఎస్ మేనిఫెస్టోతో బరిలో నిలిచి, గులాబీ శ్రేణుల శ్రమతో గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. గురువారం డివిజన్ కేంద్రంలోని మున్సిపాలిటి బీఆర్ఎస్ పార్టి కన్వీనర్ కనకం గణేష్ ఆధ్వర్యంలో కడియం రాజీనామా చేయాలంటూ హన్మకొండలోని ఆయన ఇంటి అడ్రసుకు బీఆర్ఎస్ శ్రేణులు పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కనకం గణేష్, మున్సిపాలిటీ కో కన్వీనర్ పెసరు సారయ్య మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా
గెలిపి గెలిపించమని కడియం వేడుకోగా, అధిష్టానం ఆదేశాల మేరకు కడియంను గెలిపించడం జరిగిందన్నారు. అధికార దాహంతో, తన కూతురును ఎంపీ చేయాలనే లక్ష్యంతో బిఆర్ఎస్ పార్టీని, బిఆర్ఎస్ శ్రేణులను మోసం చేసి కడియం కాంగ్రెస్ పార్టీలో చేరారని వారు విమర్శించారు. పార్టీ పిరాయింపుల కేసు విషయంలో తను ఏ పార్టీలో ఉన్నాడో స్పీకర్ కు వివరణ ఇచ్చే ధైర్యం కడియంకు లేదన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన కడియం ఇప్పటికైనా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయాలని, లేని యెడల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కడియం ఇంటికి, స్పీకర్‌కు పోస్ట్ కార్డులను పంపిస్తూ ఉద్యమాన్ని ఉదృతం చేయడమే కాకుండా, గ్రామాలలో తిరగకుండా అడ్డుకుంటామని వారుహెచ్చరించారు. సమస్యల పరిష్కారంలో ప్రజలకు కడియం అండగా ఉంటాడని నమ్మి గెలిపిస్తే, గత నెల రోజులుగా రైతులు యూరియా కోసం తిండి తిప్పలు లేకుండా నానా ఇబ్బందులు పడుతుంటే కడియం పట్టించుకోవడం లేదని వారు అన్నారు.
మరో సకల జనుల సమ్మె చేపడతాం
బిఆర్ఎస్ పార్టి కారు గుర్తుపై గెలిచిన కడియం వారసత్వ రాజకీయాల కోసం కాంగ్రేస్ పార్టీలో చేరినప్పటి నుండి ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి, కాంగ్రేస్ పార్టీ గుర్తుతో గెలువాలని, ఎన్ని మార్లు డిమాండ్ చేసినా కడియం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైన కడియం రాజీనామ చేసి, ఉప ఎన్నికలలో విజయం సాధించి తన సర్పా చూపించాలని, లేని యెడల కడియం రాజీనామ చేసే వరకు అవసరమైతే మరో సకల జనుల సమ్మే చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేష్ కుమార్, ఉగ్గు రాజు. పార్శి రంగారావు, గుండె మల్లేశ్, మారపల్లి ప్రసాద్, గాడే రాజు, గోవిందు అశోక్, బంగ్లా శ్రీనివాస్, గుర్రం శంకర్, ఆకారపు ఆశోక్, చిట్టిబాబబు, తాటికొండ అనిల్ తదితరులు పాల్గొన్నారు.