బీబీనగర్, జనవరి 22 : బీబీనగర్ మండలంలోని నీళ్ల తండా గ్రామంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జరిగింది. గ్రామ శాఖ అధ్యక్షుడిగా రాజు నాయక్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం, గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోత్ శాంతి పాండు నాయక్, ఉప సర్పంచ్ మహేందర్, గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు పాండు నాయక్తో పాటు పార్టీ నాయకులు గణేష్ భానోత్, శీను, రాంజీ, మోహన్, లింగ నాయక్, బానోత్ బన్షిత్, బానోత్ మంతా పాల్గొన్నారు.