BRS leaders : ‘తెలంగాణ రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ ఏదో ఒకటి తేలిపోవాలని ప్రకటించి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటికి 15 ఏళ్లు పూర్తయ్యాయి. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో రోగులకు బీఆర్ఎస్ నేతలు పండ్లు పంపిణీ చేశారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, MLA లు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.