BRS | బండి సంజయ్ కేటీఆర్‌కు క్షమాపణ చెప్పే వరకు వదిలే ప్రసక్తే లేదు : బీఆర్ఎస్ నేతలు
కేంద్రమంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ
రాజన్న సిరిసిల్ల మే 7(నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : కేంద్రమంత్రి బండి సంజయ్ పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భగ్గుమన్నారు. బండి సంజయ్ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కేంద్రమంత్రి సంజయ్ కేటీఆర్‌కు క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే పర్యటనకు రావాలని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఉదయాన్నే బీఆర్ఎస్ నేతలను సిరిసిల్ల పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ లను హౌస్ అరెస్టు చేశారు. జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు తో పాటు బీఆర్ఎస్ వై నేతలను సిరిసిల్ల బైపాస్ రోడ్డులో అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులు అక్రమ అరెస్ట్ లు చేసినప్పటికీ ఊరుకోబోమని, కేటీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. భేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని, క్షమాపణ చెప్పే వరకు ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ నేతలు తీవ్ర వాగ్వాదం జరిగింది. బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖబర్దార్ బండి సంజయ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో సిరిసిల్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్ట్ అయిన వారిలో మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

