మాగనూరు కృష్ణ : కృష్ణానది నుంచి రాత్రి వేళలో అక్రమ ఇసుక రవాణా ( Illegal sand transportation ) జోరుగా కొనసాగుతుందని ఈ అక్రమ ఇసుక రవాణాను సంబంధిత అధికారులు అరికట్టాలని కృష్ణ మండల బీఆర్ఎస్ నాయకులు ( BRS leaders ) ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేశారు. బీఆర్ఎస్ యువ నాయకులు శివరాజ్ పటేల్, శివప్ప గౌడ మాట్లాడుతూ కృష్ణానది నుంచి టిప్పర్ల ద్వారా విచ్చలవిడిగా రాత్రి వేళలో అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టి, అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియా వల్ల సామాన్యులకు, రోడ్డు పక్కన జీవనం సాగిస్తున్న వారికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి వెళ్తే ఫోన్లు చేసి టిప్పర్ తో గుద్ది చంపుతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మార్వో, వెంకటేష్‌కు, ఎస్ఐ నవీద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో అంబ్రెష్, శంకర్, నాయక్, భీమ్, సురేష్, వెంకటేష్, మహాలింగ, అంజప్ప, మారెప్ప, నాగప్ప, తదితరులు పాల్గొన్నారు.