RS Praveen Kumar | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ అధపాతాళంలోకి పోతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీల్లో ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు అందలేదు. ఈ అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
విద్యా సంవత్సరం ప్రారంభమై నేటి మూడు నెలలైంది. అయినా చాలా కాలేజీల్లో ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు రాలేదని విద్యార్థులు రోదిస్తున్నారు. ఇందుకోసమేనా తమరు విద్యాశాఖను తమరి దగ్గరనే పెట్టుకున్నారా..? మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోవడం లేదు.. ఇది నిజం.. అగాథంలోకి తెలంగాణ పోతుందని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొనాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
గౌరవ తెలంగాణ @TelanganaCMO @revanth_anumula గారు,
విద్యా సంవత్సరం మొదలై నేటికి మూడు నెలలైంది. అయినా చాలా కళాశాలల్లో పాఠ్యపుస్తకాలు రాలేదని విద్యార్థులు రోదిస్తున్నారు! ఇందుకోసమేనా తమరు విద్యా శాఖను తమరి దగ్గరనే పెట్టుకున్నారు? Telangana is not Rising under your leadership, it is… pic.twitter.com/CzNHvfKPGU— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 6, 2025